How to prepare for Janata Carfew

జనతా కర్ఫ్యూ – రేపు ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మనమందరం  ప్రజా కర్ఫ్యూను పాటిద్దాం. కరోనా వైరస్ ను తరిమి కొడదాం.. #CoronaVirus #JantaCarfew 

జనతా కర్ఫ్యూ ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

 • శనివారం నాడే  రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి.
 • రెండు రోజులకి సరిపడా కూరలు కొనండి.
 • అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శని వారం తెచ్చుకోండి.
 • పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి.
 • ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి.
 • ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి.
 • అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది.
 • పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోండి.
 • డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి.
 • బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
 • 22 వ తేదీ నాడు ఇంట్లో ఉన్న టీవీ remote, AC Remote. Lighter,  Door nobs, door handles, Door latches, మీరు వాడే bike లు, watch strips, bike keys, అన్నీ కూడా Dettol కలిపిన నీటితో క్లీన్ చేయండి
 • Bike లు కూడా వీలయితే Dettol కలిపిన water తో ఇంట్లోనే clean చేయండి. (At least handle grips, etc)
 • పండుగ వస్తుంది కాబట్టి, ఇంట్లో మీ శ్రీమతి కి house cleaning lo సహాయ పదండి.
 • Lunch అందరు కలిసి చేయండి.(ఇంట్లో prepare చేసిన  food మాత్రమే)
 • Only Veg శాకాహారం  మాత్రమే!
 • After lunch పైన ఉన్న అన్ని రకాల పనులు చేశారు కాబట్టి rest తీసుకోండి.
 • సరిగ్గా 5.00PM కు మీ ఇంటి gate దగ్గర నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
 • Evening 7-10ETV సినిమా లో పాత తరం సినిమా చూసి ఆనందించండి.(మీకు నచ్చిన సినిమా కూడా చూడొచ్చు)
 • జనతా కర్ఫ్యూ విజయ వంతం చేయండి.

కరోనా వైరస్ విషయమై కొన్ని అతి ముఖ్యమైన సూచనలు

 1. పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి మాత్రమే తదుపరి ఉపయోగించండి.
 2. సాధ్యమైనంతవరకు న్యూస్ పేపర్లను వచ్చేనెల అంతం వరకు ఉపయోగించకండి.
 3. ఒక నెల రోజుల పాటు జొమాటో స్విగ్గి లను సాధ్యమైనంత వరకూ ఊ వినియోగించ కండి.
 4. ఇంటికి తీసుకువచ్చిన కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి.
 5. ఎక్కువగా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్ ఫోన్ మరియు రిమోట్ లను కనీసం రోజుకు ఒకసారి క్లీనింగ్ ఫ్లూయిడ్ తో శుభ్రపరచాలి.
 6. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు గానీ కనీసం గంటకు ఒకసారి సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రపరుచుకోవాలి.
 7. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయండి.
  8.జిమ్ములను స్విమ్మింగ్ పూల్ ను ఇతర ఎక్ససైజ్ ప్లేస్ ను ప్రైవేట్ లను డాన్స్ క్లాసులను సంగీత క్లాసులను అవాయిడ్ చేయండి.
 8. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే మీ బట్టలను తొలగించి దూరంగా ఉంచి కాళ్ళను చేతులను అతి శుభ్రంగా కడుక్కోండి.
 9. అతి ముఖ్యమైన విషయం పూర్తిగా చేతులను శుభ్రపరచకుండా మీ ముఖమును అందలి భాగములను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు.
 10. పనిమనుషులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు కడుగుకొని తదుపరి పని చేయమని చెప్పండి వారిని మెయిన్ గుమ్మాలు కానీ గోడలు కానీ తాకకుండా ఉండేటట్లు చూడండి. వారికి కూడా శుభ్రత విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి.
 11. అతి ముఖ్యమైన రెండో స్టేజ్ నుండి మూడో స్టేజ్ కి వెళ్లే పరిస్థితుల్లో మన దేశం ఉంది ఇటలీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది అంటే మనదేశంలో ఆ పరిస్థితి వస్తే ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి తేలికగా తీసుకోకండి.
  అవకాశం ఉన్నంత మేరా ఈ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయండి.
  మిత్రులారా… వైద్య సలహాల కోసం మన వైద్య నిలయం బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి….

మీరు తప్పకుండా జనతా కర్ఫ్యూ పాటించండి … దయచేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment