#InternationalYogaDay2020

Benefits of Yoga యోగాతో లాభాలెన్నో … #InternationalYogaDay2020

ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ...
 •  
 • 17
 •  
 •  

Benefits of Yoga యోగాతో లాభాలెన్నో … #InternationalYogaDay2020

యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసి అపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్నకొద్ది శరీరం తేలికవుతుంది, ఆలోచనలు దారికి వస్తాయి, జీవనశైలిలో మంచి మార్పొస్తుంది. యోగా వల్ల కలిగే లాభాలు …

అల్ రౌండర్ ఫిట్నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతుల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్ గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారన్నదే ఆరోగ్యానికి కొలమానం. ఆసనాలు, ప్రణాయామం, ధ్యానం – ఇవన్ని కలసి ఒక ప్యాకజిగా దానికి దోహదపడతాయి.

రువు తగ్గడం : అందరికీ కావల్సిన్దిదే, సూర్య నమస్కారాలు, కపాలభాతి ప్రణాయమం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్ప కుండా యోగా చేసేతప్పుడు మనకు తెలియకుండానే మనం తీసుకొనే ఆహారం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

ఒత్తిడి నివారణ : ఉదయాన్నే కొద్ది సేపు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. శరీరంలోని మలినాలను వదిలించడంతో పాటు మనస్సు పరిశుభ్రంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుంది.

ప్రశాంతత : ప్రకృతిలోని ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశాలంటే మన అందరికీ ఇష్టమే. కాని ప్రశాంతత కోసం ఎక్కడికో వేల్లనవసరం లేదు, అది మనలోనే ఉంటుంది. రోజుకోసారి లోపలికి ప్రయాణించి దాన్ని అనుభూతి చెందవచ్చు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుతపరచటానికి యోగాను మించిన సాధనమేదీ లేనే లేదు.

అవగాహన : మన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. గతం, భవిష్యత్తులకు సంబంధించిన అనేక అంశాలతో అది పరుగులు పెడుతూ ఉంటుందేగాని వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. యోగ, ప్రణాయామాల వల్ల ఈ సత్యం అవగాహనలోకి వస్తుంది. దాంతో ఆలోచనలను నియంత్రించడం సులువు అవుతుంది. అప్పుడే వర్తమానం మీద ఫోకస్ చెయ్యగలుగుతాం.

మెరుగైన సంబంధాలు : జీవిత భాగస్వామి, తల్లితండ్రులు, సహోదరులు, స్నేహితులు – ఇలా చుట్టూ ఉన్న అన్ని బంధాలను మెరుగు చెయ్యడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రశాంతమైన మనసు, అదుపులో ఉంటె భావోద్వేగాల వల్ల ప్రేమ, అనుబంధాలు ధృడమవుతాయి.

ఎక్కువ శక్తి: ఒకేసారి నాలుగు రకాల పనులు చెయ్యడంతో రోజంతా పనిచేసిన తర్వాత పూర్తిగా అలసిపోయి, శక్తినేవరో లగేసినట్టు అయిపోతారు చాలామంది, కొద్ది సేపు యోగా చేస్తే మళ్ళీ తాజాగా, ఉత్సాహంగా ఉంటారు.

ఫ్లెక్సిబిలిటి : ఉరుకులు పరుగులు నిండిన జీవనశైలి వల్ల చిన్నాపెద్దా అందరికీ సాయంత్రానికల్లా ఒంటి నొప్పులు సాధారణమైపోయాయి. యోగా కండరాలను బలోపేతం చేసి టోన్ చేస్తుంది. నడిచిన, నిలబడినా, కూర్చున్నా సరైన భంగిమలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. దానితో ఒంటి నొప్పులు దరికి చేరావు.

మీ శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయక మౌనంగా ధ్యానం చేయండి. మనశ్శక్తి సమీకరించి అధ్యాత్మిక శక్తి జనకంగా అవతరించండి.
— స్వామి వివేకానంద

 •  
  17
  Shares
 • 17
 •  
 •  
 •  

Leave a Comment