ఈ వారం రాశిఫలాలు : డిసెంబర్ 02 ఆదివారం నుండి 8 డిసెంబరు శనివారం వరకు

ఈ వారం రాశిఫలాలు : డిసెంబర్ 02 ఆదివారం నుండి 8 డిసెంబరు శనివారం వరకు Weekly Horoscope Raasi Phalalu Telugu Astrology

మేషం – 21st March to 20th April Aries (Mesh Rashi)

ఈ వారం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుందని ముందే చెబుతున్నా. వివాహితులు తమ భాగస్వామీ సంతోషంగా ఉండేందుకు చెయ్యాల్సిందంతా చేస్తారు. అయితే వారి నుంచి అదే స్థాయిలో స్పందన లేకపోవడం మీకు తీవ్రమైన నిరాశ, నిస్పృహలను కల్గిస్తుంది. రెండో స్థానంపై శుక్రుని ప్రభావం ఉండటం ఆర్థికంగా బాగుంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కసారిగా పెరుగుతుంది. చివరిగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా తిరుగులేని స్థానంలో ఉంటారు. అయితే బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల అనుకోని కారణాల వల్ల భారీ మొత్తంలో రావాల్సిన ఆర్థిక లాభాలు ఒక్కసారిగా సన్నగిల్లుతాయి. ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాల్సినవసరం ఉంది. నడిచేటప్పుుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి.

కాలు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి.

వృషభం – 21st April to 21st May Taurus (Vrishabh Rashi)

మీ చుట్టు పక్కల పరిసరాల పట్ల మీరు మరింత జాగ్రర్త తో ఉండాల్సినవసరం ఉంది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో మీరు చెయ్యని తప్పులకు మీరు మాటలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో ఇంట్లో అవసరాలను తీర్చాల్సి రావడమే కాదు, మీరు ఎంతో ఇష్టపడేవారికి సంబంధించి మానసిక, సాధారణ అవసరాలు కూడా తీర్చాల్సి వస్తుంది. ఆఫీసులో తలెత్తే సాంకేతిక కారణాలు ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు ప్రశాంతంగా వ్యవహరించాలని నేను సూచిస్తున్నా. అననుకూల గ్రహాల మార్పు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత సున్నితంగా చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యండి.

త్వరలోనే పరిస్థితులు మారుతాయి. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి.

మిథునం – 22nd May to 21 June Gemini (Mithun Rashi)

ఈ వారం ప్రారంభంలో అందివచ్చే అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. అయితే మీ గ్రహాధిపతి బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల ఒప్పందాలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత సహనంగా ఉండండి. త్వరలోనే సరైన సమయం వస్తుంది. మీరు ఏదైనా పని పూర్తి చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు దాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసుకొని సబ్ మిట్ చెయ్యాలని సూచిస్తున్నా.సూర్యునితో కలిసి గురుడు ఏడో స్థానంలో ప్రయాణిస్తున్నాడు. వివాహితులు మీ భాగస్వామి పట్ల మాట మాటా పెంచుకోవద్దు. వాదులాటకు దిగొద్దు. మీ భాగస్వామి నుంచి మరీ ఎక్కువగా ఆశించడం మీ నిరాశ నిస్పృహలకు కారణం కావచ్చు.

కాస్త సమయం తీసుకోండి. త్వరలోనే మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ సమసిపోతాయి.కర్కాటకం – 22nd June to 22nd July Cancer (Karka Rashi)

ఓ రకమైన టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితుల మధ్య మీరు చిక్కుకున్నారన్న భావనలో మీరుంటారు. బహుశా అవి ఆలోచనలు, కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు. ఈ పరిస్థితి ప్రధాన కారణం మీ గ్రహాధిపతి చంద్రుడు నాల్గో స్థానంలోకి రావడం దానిపై అటు శని, ఇటు కుజుల ప్రభావం ఉండటం. ఎలాంటి రిస్కులు తీసుకోకుండా వ్యాపారం చెయ్యాలని శని పదే పదే చెబుతుంటాడు. అలాగే అనవసర ఖర్చులు పెట్టే ముందు ఒక్కసారి మీ ఆర్థిక పరిస్థితిని చూసుకోండి. అలాగని అంతా సవ్యంగా సాగిపోతుందని భావించవద్దు. శని, కేతువు మీ రాశిలోని ఏడో స్థానం గుండా ప్రయాణించడం వల్ల మీ దారిలో చిక్కులు, అడ్డుంకులు తప్పవు. వ్యక్తిగత విషయాల్లో పెద్దగా అభివృద్ధి సూచనలేం కనిపించడం లేదు.

మీ సన్నిహితుల్ని సంతృప్తి పరిచేందుకు ఎప్పుడూ అనుసరించే మార్గాన్నే అనుసరించండి.

సింహం – 23rd July to 21 August Leo (Simha Rashi)

ఈ వారం సంతోషంగా, విందు వినోదాలతో, సామాజిక సమావేశాలతో ప్రారంభమై మిమ్మల్ని మునివేళ్లపై నిల్చునేలా చేస్తుంది. అయితే ఎంతటి సంతోషకరమైన సమయాలైనా మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దూరం చెయ్యలేవు. శుక్రుడు ధనస్సు రాశిలోని నాల్గో స్థానంలోకి చేరిన తర్వాత మీరు మీ లైఫ్ స్టైల్ ను అప్ గ్రేడ్ చేసుకునేందుకు మరింత విలాసవంతంగా జీవించేందుకు ప్రయత్నాలు మొదలెడతారు. ఇక విద్యార్థుల విషయానికొచ్చేసరికి గురుడు సూర్యునితో కలిసి ఐదో స్థానంలో ఉండటంతో వారి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. విషయాన్ని వీలైనంతగా అర్థం చేసుకొని ఆకళింపు చేసుకోగల్గుతారు. ఫలితంగా చదువులో మీ ప్రదర్శన బాగుంటుంది. మీరు మీ సుఖాల కోసం పని విషయంలో రాజీ పడొద్దు. అలా చెయ్యడం వల్ల పరిస్థితులు తారు మారు కావచ్చు.జీవితం అనేది నిన్న రాత్రినే సగం చచ్చిపోయింది.

కన్య – 22nd August to 23rd September Virgo (Kanya Rashi)

ఏ విషయాన్నైనా లోపల దాచుకోకూడదు. మీపై మీకుండే ఈ నమ్మకం, ఓపికే మీ సమస్యలకు తగిన పరిష్కారాలని చెప్పాలనుకుంటున్నా. ఈ వారం లాభదాయకంగా ప్రారంభమవుతుంది. భారీ ఎత్తున ధనం సంపాదించే అవకాశాలు వెత్కుకుంటూ వచ్చే అవకాశం ఉందని గ్రహస్థితి సూచిస్తోంది. అయితే బుధుడు తిరోగమనంలో ఉండటంతో పనులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనసవరంగా ఆశని, నిగ్రహాన్ని కోల్పోకుండా మీకు ఆప్తులైన వారికి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యండి. వారంతానికి బుధుడు మళ్లీ పురోగమన స్థితికి వస్తాడు. ఫలితంగా ప్రశాంతంగా పని చేసుకోవడమే కాదు… మీరు అనుకున్న లక్ష్యంవైపు వేగంగా అడుగులు వేస్తారు.

తుల – 24th September to 23rd October Libra (Tula Rashi)

మీకిష్టమైన మీరు ఎంచుకున్న హాబీ విషయంలో మీ తపన నెరవేరే అవకాశాలు ఈ వారంలో మీకు లభిస్తాయి. డ్యాన్స్ కావచ్చు లేదా మ్యూజిక్ కావచ్చు లేదా రాయడం కావచ్చు ఈవారంలో వాటికే మీరు ఎక్కు వ సమయం కేటాయిస్తారు. మానసికంగా ఇది మీకు చాలా ఉపశమనాన్ని కల్గిస్తుంది. బుధుడు తిరోగమనంలో ఉన్నందున కీలక ఆర్థిక నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఆ నిర్ణయాల కారణంగా పరిస్థితులు ఎదురుతిరిగే అవకాశం ఉంది. గురునితో కలిసి సూర్యుడు మూడో స్థానంలోకి వస్తాడు. సూర్యుని ప్రభావంతో సామాజికంగా మీకు కలిసొస్తుంది. ఒక్కసారిగా మీరు అందరి మనిషిగా మారిపోతారు. అంత మాత్రాన మీరు ఆశ్చర్యానికి గురికావాల్సినవసరం లేదు.

వృశ్చికం – 24th October to 22nd November Scorpio (Vrishchik Rashi)

ఈ వారంలో ప్రారంభంలో విజయం యొక్క ఫలితాన్ని, భారీ లాభాన్ని కళ్ల జూస్తారు. అదే సమయంలో దాని ఫలితంగా మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు కూడా. నిజానికి భారీ ఎత్తు సంపాదించడం , లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మీరు సంతృప్తి పడాలనుకుంటారు. దీనికి కారణం కుజుడు, చంద్రునితో కలిసి 12వ స్థానంలో సంచరిస్తుండటమే.దూకుడు మంచిదే కానీ దాన్ని సరైన దిశలో నడిపించాలని సూచిస్తున్నా. ఒక్కసారిగా వచ్చిన పేరు ప్రఖ్యాలను హాయిగా ఎంజాయ్ చెయ్యండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గురుడు, అలాగే తిరోగమనంలో ఉన్న బుధుడు ఇద్దరూ మీ ఆర్థికస్థితిగతులపై ప్రభావం చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎదుర్కోబోయే ఆర్థిక సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

ధనుస్సు – 23rd November to 22nd December Sagittarius (Dhanus Rashi)

మీకు ఎదురయ్యే అవకాశాల విషయంలో చాలా జాగురకతతో , అప్రమత్తతో ఉండాలి. వాటి విషయంలో తక్షణం స్పందిచకపోయినా లేదా ఆలస్యం చేసినా భారీ ఎత్తున ధనం సంపాదించే మంచి అవకాశాలను కోల్పోవచ్చు. ఇంట్లో పరిస్థితులు ప్రశాంతంగా , సంతోషంగా ఉంటాయి. శుక్రుడు పన్నెండో స్థానంలో సంచరిస్తుండటం వల్ల మీకు ఇష్టమైన వారికి సంతోషం కల్గించే విషయాలపై కొంత ధనం ఖర్చు పెడతారు. ఫలితంగా వారికి మీకు మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ గ్రహాధిపతి గురుడు సూర్యునికి దగ్గరగా ఉండటంతో రగిలిపోతుంటాడు. సూర్యునికి దగ్గరగా ఉండటంతో గురుని ప్రభావం పల్చబడుతుంది. వారంతంలో బుధుడు నేరుగా ప్రభావం చూపుతాడు. ఫలితంగా మీ రోజువారీ పనులు సవ్యంగా సాగిపోతాయి.మకరం – 23rd December to 20th January Capricorn (Makar Rashi)

మీ కెరియర్ గ్రాప్ ను పెంచుకునేందుకు మీ చేపట్టే ప్రాజెక్టుల్లో పనుల వేగాన్ని పెంచుతారు. అయితే పదో స్థానంపై శని ప్రభావం కారణంగా మీరు చేరాలనుకున్న లక్ష్యం చేరుకోవడంలో ఆలస్యం కావచ్చు. శుక్రుడు తిరోగమనంలో ఉన్న బుధునితో కలిసి 11వ స్థానంలో సంచరించడం వల్ల లాభాలకు కారకుడవుతున్నాడు. వారం మధ్యలోకి వచ్చేసరికి వ్యాపారమే వారసత్వంగా గల వ్యక్తులు ఇచ్చిన అవకాశాల కారణంగా భారీ ఎత్తున ఆదాయం వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల ఈ డీల్ కుదరడంలో ఆలస్యం కావచ్చు. గతంలో మీరు సబ్ మిట్ చేసిన పనిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. లేదా వాటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుంభం – 21st January to 19th February Aquarius (Kumbha Rashi)

కొన్ని సార్లు మీ తప్పు లేకపోయినా వాటి ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ వారం బహుశా అలాంటిదే జరిగే అవకాశం ఉంది. వ్యాపారం విషయంలో కొస్తే మీ సిబ్బందిలోని ఓ కీలకమైన ఉద్యోగి చేసిన పని కారణంగా మీరూ నష్టాలపాలయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆయన తన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇస్తాడు. అయితే ఈ పరిస్థితికి పూర్తిగా తిరోగమనంలో ఉన్న బుధుడు శని తో కలిసి పన్నెండో స్థానంలో ఉండటమే. పదే పదే శుక్రుడు చలిస్తూ ఉండటం మీ జీవితంలో సానుకూల పరిణామాలు ఏర్పడేందుకు కారణమవుతుంది. ఒక విషయంలో అత్యుత్తమంగా వ్యవహరిస్తారు. దాని ప్రభావం సానుకూలంగా ఉండటమే కాదు మిమ్మల్లి గాల్లో తేలేలా చేస్తుంది కూడా.

మీనం – 20th February to 20th March Pisces (Meena Rashi)

కెరియర్ విషయంలోనూ, అలాగే వృత్తి వ్యాపార విషయాల్లోనూ ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సానుకూల గ్రహాలు 9వ స్థానం గుండా సంచరించడం సంతోషించాల్సిన విషయం. మీ గ్రహాధిపతి గురుడు సూర్యునితో కలిసి ఉంటాడు. అయితే ఆ కారణంగా గురుని యొక్క సానుకూల కిరణాల ప్రభావం సన్నగిల్లుతుంది. అయితే సూర్యుడు పదో స్థానం గుండా సంచరిస్తుండటంతో మీ వృత్తి, ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరి విషయంలోనూ విమర్శలకు దిగకండి. ఎదుటి వారిని వేలెత్తి చూపడం ఒక్కోసారి తిరిగి మిమ్మల్నే చిక్కుల్లో పడేయవచ్చు. తగిన సమయం వచ్చేంత వరకు ఓపికతో వ్యవహరించండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, శారీరకంగా అంతా బాగానే ఉంటుంది.

ఇక జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే
మీ యొక్క జాతకము మరియు జాతక సమస్యల పరిష్కారముల. కొరకు జాతకము. వ్రాయించుకోదలచినవారు&చెప్పించుకోదల్చినవారు మీరు జన్మించిన తేదీ , సమయం మరియు ప్రదేశాలను ఆధారంగా మీ జాతకమును రూపొందించడం జరుగుతుంది. ఈ జాతక చక్రం ఆధారంగా విద్య , ఆర్థిక పరిస్థితి , ఉద్యోగం , వ్యాపారం , వివాహం , సంతానం , ఆరోగ్యం , విదేశీ యానం , మొదలయిన ముఖ్య విషయాలు వివరించడం జరుగుతుంది అంతే కాక మీకు కలిగే సందేహాలను నివృత్తి చేసి దోష నివారణకు ఆచరించవ‌సిన శాంతి-జప-హోమ-హోమ కార్యక్రమాలు కుడా చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్.
9502059649 . (ఒక జాతకుని జాతకం 600/-రూపాయలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి