శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారి విధానంలో తీసుకోదగినవి మరియు తీసుకోకూడనివి

0
753
Veeramachaneni-Ramakrishna-diet-food-items

శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారి విధానంలో తీసుకోదగినవి మరియు తీసుకోకూడనివి. Veeramachaneni Ramakrishna diet food items

తీసుకోదగినవి (Food items, we can you have during Veeramachaneni Ramakrishna diet plan)

 1. టీ, కాఫీ—– పాలు, పంచదార లేకుండా తీసుకోవచ్చు.
 2. గ్రీన్ టీ, బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీతీసుకోవచ్చు
 3. ఉప్పులేకుండా సోడా రోజుకు అర లీటరు తాగవచ్చు
 4. మజ్జిగ (రెండు స్పూన్ల పెరుగుతో ఒక లీటర్ నీటితో తయారు చేసుకోవడం) తీసుకోవచ్చు
 5. గోరుచిక్కుడు, గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, వంకాయ, దొండకాయ, క్యాప్సికం, దోసకాయ, మునగకాయ, మునగాకు కూర, మునగాకు సూపు, అన్నిరకాల ఆకుకూరలు నిరబ్యంతరంగా తినవచ్చు. శాఖాహారానికి పరిమితి లేదు. తినగలిగితే కేజీ తినవచ్చు.
 6. పాక్షికంగా తినాల్సినవి: రోజు మొత్తంమీద
  • టమాటా పెద్దది -1 లేదా చిన్నవి – 2
  • క్యారెట్-1
  • ఉల్లిగడ్డ- 1
 7. కీరదోస అధికంగా నీరు ఫైబర్ ను కలిగి ఉంటుంది కనుక పరిమితి లేకుండా తీసుకోవచ్చు.
 8. ముదురు కొబ్బరి లేదా ఎండుకొబ్బరి ఒక చిప్పవరకు తీసుకోవచ్చు.
 9. పాలు,పెరుగు తీసుకోకూడదు ( కానీ సొరకాయ, బీరకాయ, తోటకూర కాడలు వంటివి వండుతున్నప్పుడు కొద్దిగా పాలు రుచికోసం వాడుకోవచ్చు

[amazon_link asins=’B01HBRBY5E,B017AD65Z8,B0759RX62G,B01LZ5DFW2,B074J7R9RQ,B0754K4H8C’ template=’ProductCarousel’ store=’asweb2018-21′ marketplace=’IN’ link_id=’4f9c8754-7eec-11e8-ab3c-134d095e540f’]

తీసుకోకూడనివి (Food items, we should not take during Veeramachaneni Ramakrishna diet plan)

 1. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, పూరి, పరోట, వడ, గారే, బోండా, బజ్జీలు….. మొదలగు పిండి పదార్థాలు ఏవి తీసుకోకూడదు.
 2. వైట్ రైస్, బ్రౌన్ రైస్ (ముడిబియ్యం), జొన్నలు ,రాగులు, బార్లీ, ఓట్స్, గోధుమలు, మొక్కజొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, వరిగెలు, సామలు,కినోవా, అన్నిరకాల పప్పులు మొదలగునవి ఏవి తీసుకోకూడదు.
 3. ఎటువంటి పళ్ళు, పళ్లరసాలు తీసుకోకూడదు
 4. దుంపలు: బంగాళదుంప, చేమగడ్డ, కందగడ్డ, బీట్రూట్, కూర అరటి, చిలగడదుంప(గణ సగడ్డ),పెండలం, నాటు చిక్కుడు, బీన్స్, పచ్చిబఠాని తినకూడదు.
 5. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు
 6. ధూమపానం ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించదు కాదు – కానీ శరీరమంతా బాగుపడి గుండె కు రంధ్రాలు పడటంవల్ల ఉపయోగం లేదు కావున మానేయడం ఉత్తమం.
 7. బెల్లం, తేనే, పంచదార, తీపి పదార్థాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రసాదం, తీర్థం, కొబ్బరినీరు, లేత కొబ్బరి తీసుకోకూడదు
 8. పనసకాయ కూర కూడా వండుకొనకూడదు.
 9. చింతపండు, చింత చిగురు వాడరాదు.
 10. మీల్ మేకర్, పచ్చి మామిడికాయలు,పుచ్చకాయ తినకూడదు.
 11. సబ్జా గింజలు, చియా సీడ్స్ వాడరాదు.
 12. ఎటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకో కూడదు.
 13. సుగర్ కోటెడ్ మల్టీ విటమిన్ టాబ్లెట్ వాడకూడదు.
 14. ఆయుర్వేద మందులు తీయదనాన్ని కలిగి ఉంటాయి కనుక వాడరాదు.
 15. పిల్స్ రూపంలో ఉన్న హోమియో మందులు కూడా వాడరాదు.
  (తప్పనిసరైతే ద్రవరూపంలో ఉన్న మరియు టింక్చర్ రూపంలో ఉన్న హోమియో మందులు వాడవచ్చు )

Diet after completion of VRK Diet Plan – రామకృష్ణ గారి డైట్ తరువాత ఏమి తినాలి

తప్పక చదవండి : రామకృష్ణ గారి డైట్ చేసేటప్పుడు వచ్చే డౌట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here