వర్షాకాలంలో చర్మానికి వచ్చే ఇబ్బందులు..నివారణలు

Skin care tips in Rainy season వర్షాలు  పడుతున్నాయి అంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. చల్లని  వాతావరణంలో వేడిగా టీ’ తాగుతూ, ఎక్కువ శ్రమ లేకుండా మన పనులన్నీ చేసుకొంటాము. అయితీ సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది ఈ  వర్షాకాలం. ముఖ్యంగా  చర్మానికి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి. సరైన జాగ్రత్తలు వహిస్తే మంచిది. చర్మం పొడిబారడం కారణంగా దురదలు రావడం, ధద్దురులు వంటివి ఏర్పడతాయి. దీని నుంచి మనల్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు తెల్సుకుందాము.

See also అల్లంతో రుతుక్రమ తిమ్మిర్లని నివారించవచ్చా? How to stop period pain immediately with Ginger

మొదటగా.. కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాకా ఈ మిశ్రమాన్ని వంటికి రాసుకొని మర్దన చేసుకోవాలి. ఒక అరగంట  ఆగి స్నానం చేసుకొంటే, దురదలు దూరం..ధద్దురులు  మాయం.. కాకపోతే.. ఇలా రోజు విడిచి  రోజు చేస్తే.. మంచి  ఫలితాని పొందుతారు.

ఇక రెండో చిట్కా ఏంటంటే… మాడు పొడిబారి పొట్లు రాలడం, దురద పెట్టడం,  జుట్టు డ్రై అవ్వడం. దీనికోసం  కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని ఇందులో రెండు లేక మూడు చుక్కలు వినెగర్ కలిపి, ఆ మిక్స్ ని తలకి బాగా రాసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇష్టముంటే ఒక పూట  అలానే ఉంచి మరునాడు  స్నానం చేయచ్చు.  లేదంటే, ఒక గంట ఆగి  తల స్నానం చేసుకొంటే, జుట్టులో దురద,పొడిబారడం పోవడంతో పాటు..వినెగర్ ఉండటం వలన జుట్టుకి మంచి షైన్ కూడా వస్తుంది.

ఇక మూడో చిట్కాలోకి వెళ్దాం…కలబంద మొక్క తెల్సుకదా.. దీని గుజ్జుని తీసుకొని, అంతే మోతాదులో బొప్పాయ గుజ్జుని కలిపి ఒంటికి, తలకి పట్టించాలి. ఈ మిశ్రమంతో  చర్మానికి తేమ తో పాటు గ్లో కూడా వస్తుంది. మాడు కైతే దురదలు పోయి జుట్టు షైన్ అవ్వడంతో పాటు సిల్కీ గా కూడా మారుతుంది.

మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా Youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక subscribe చేసుకోండి.

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి