కీళ్ల నొప్పులా ? ఈ 9 చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా తగ్గుతాయి

Natural home remedies arthritis joint pain relief కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని అందరం భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటించి, తీసుకునే ఆహార పదార్ధాలలో కొంత జాగర్తలు తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. మరి కీళ్ల నొప్పుల నుండి తేలిగ్గా ఉపశనామాన్ని కలిగించే మార్గాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూస్తే తెల్లారేసరికి మంచి ఫలితం ఉంటుంది.
  2. కీళ్ల నొప్పులు ఉన్న వారు వ్యాయాయం చేయకూడదు అన్న ఒక అపోహ ప్రజలలో బలంగా ఉంది. నిజానికి అది తప్పు. తేలికపాటి వ్యాయాయం  సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి.
  3. కీళ్ల నొప్పులు ఉన్నవారు.. నొప్పులు తగ్గుతాయని  పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం 100 శాతం మంచిది కాదు.
  4. కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు, ఉర్లగడ్డలు తాము డైట్ లో లేకుండా చూసుకోవాలి.
  5. ఆహరం విషయంలో కీళ్ల నొప్పులు ఉన్నవారు  విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, కమలాపండు మొదలైనవి. Don’t miss ఇల్లాలికి వంటింటి చిట్కాలు
  6. వారానికి ఒకసారి ఉపవాసం ఉండి.. ఆ రోజు  క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గేడానికి ఎక్కువ అవకాశం ఉంది.
  7. కీళ్ళ నొప్పులతో భాద పడేవారు నీరు ఎక్కువగా తాగాలి, దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా పోషకాలు రక్తం ద్వారా కీళ్ళకు అంది ధృడంగా ఉంటాయి.
  8. అల్లం లో శోధ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రతి రోజు అల్లం రసం తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది చేతులు మరియు వేళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది.
  9. కీళ్ళ నొప్పులకు యూకలిప్టస్‌ ఆయిల్‌ చాల బాగా పనిచేస్తుంది. నిప్పి ఉన్న చోట్ల ఈ ఆయిల్ తో మర్దనా చేసి, వేడి నీటితో కాపడం పెడితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

[amazon_link asins=’B01MTCNAIM,B01A25DZ54,B076H1RNDL’ template=’ProductCarousel’ store=’asweb2018-21′ marketplace=’IN’ link_id=’1dc3a62b-7c4c-11e8-a893-91ee3c018a71′]
 

మరిన్ని ఆరోగ్య సూత్రాల కొరకు మా Youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి