Korralu Health Benefits Foxtail Health Benefits

కోర్రాలతో అద్భుతమైన లాభాలు తెలిస్తే వెంటనే తెచ్చుకొని తింటారు!

Korralu Health Benefits Foxtail Health Benefits సాధారణంగా మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతారు. అందుకుగాను బియ్యాన్ని ఎక్కువగా పోలిష్ చేయడం వల్ల  అందులో ఉన్న పోషకవిలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని  మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.

వరిబియ్యం వండుకున్నట్లుగానే  కొర్ర బియ్యని కూడా వండుకోవచ్చు. ఎక్కువ శక్తి కలిగి ఉండటం వలన రైతులు పొలం పని చేసుకునేటప్పుడు తప్పకుండా కొర్ర అన్నాన్ని తింటారు.  వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది  మలబద్ధక సమస్య తగ్గిస్తుంది.  దీనిలో మాంసకృత్తులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం,  టైమింగ్, రైబోఫ్లేవిన్ అధిక మోతాదులో ఉంటాయి.

డయాబెటిస్ రోగులకు కొర్ర బియ్యం దివ్య ఔషదంల పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది. ఉదరసంబంధ సమస్యలకు కొర్ర బియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి ఆకలి లేకపోవడం అజీర్తి  సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ( Don’t miss this article : సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?)

అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లుటెన్ కొర్ర బియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులు జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇది  కాలిన గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్త స్రావాన్ని అదుపులో ఉంచుతుంది. కొర్రలలో  మాంసకృత్తులు, ఐరన్ శాతం  ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కొర్ర బియ్యన్ని మామూలుగా వాడుకోవచ్చు, కాకపోతే నీరు ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర్ర  గ్లాసులు నీరు పోసి నానబెట్టి వండుకోవాలి. ఇది అన్ని రకాల కూరలతో చాలా రుచిగా ఉంటుంది.

మరన్ని ఆరోగ్య సూత్రాల కొరకు మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడుండి.

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి