పండ్ల ముక్కలపై ఉప్పును చల్లుకొని తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?

పండ్లను  కట్ చేసి తీసుకొంటున్నప్పుడు కాస్త సాల్ట్ చల్లి తీసుకొంటున్నారా? పండ్ల ముక్కలను కాస్త ఉప్పు చల్లుకొని తింటే రుచి పెరుగుతుంది. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అని తెలుసుకుందాం.

పండ్ల ముక్కలపై లైట్ గా ఉప్పు చల్లుకొని తినడం ద్వారా అందులో బ్యాక్టీరియాను నశింప చేసుకోవచ్చు. సిట్రస్ కలిగిన  పండ్లలో ఉప్పు చేర్చుకొని తీసుకోవడం ద్వారా ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

పులుపుతో కూడిన పండ్లతో ఉప్పు కలుపుకొని తీసుకొంటే పులుపు తగ్గి రుచి పెరుగుతుంది. జామకాయలాంటి పండ్లకు ఉప్పు చల్లి తీసుకోవడం ద్వారా దంతాలకు మేలు చేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను కూడా నశింపచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పండ్ల ముక్కలపై లైట్ గా సాల్ట్ చల్లి తీసుకోవడం ద్వారా, వాటి నిల్వ చేయడం ద్వార ఏర్పడే బ్యాక్టీరియా, షాపుల్లో అమ్మేటప్పుడు వాటిపై ఏర్పడే బ్యాక్టీరియాను దూరం చేసుకోవచ్చు.

అందుకే పండ్లను శుభ్రంగా కడిగి  వాటిపై ఉప్పు చల్లుకొని తినడం మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కాని మధుమేహ వ్యాధిగ్రస్థులు ఇలా పండ్లపై ఉప్పుచల్లుకొని తీసుకోకూడదు. పండ్లపై చిటికెడు మోతాదులో ఉప్పు చేర్చుకొంటే పర్వాలేదు కాని అదే ఉప్పుకు స్పూన్ల పరిమాణంలో తీసుకొంటే మాత్రం గుండె జబ్బులు  కిడ్నీ వ్యాధులు తప్పనిసరిఅని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే పండ్ల ముక్కలపై లైట్ గా ఉప్పు చల్లుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిదే. కాని ఎక్కువగా మాత్రం చల్లుకొని తినకూడదు.        

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి