How To Stop Snoring Naturally in Telugu Home Remedies to rid snoring Guraka

ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ గురక మాయం How To Stop Snoring Naturally in Telugu Home Remedies to rid snoring Guraka

మనలో చాలామంది గురక సమస్యతో బాధపడుతుంటారు. దీనినే ఆంగ్లంలో స్నోరింగ్ (Snoring) అని అంటారు. ఈ గురక వాళ్ళని ఇబ్బంది పెట్టనప్పటికీ వాళ్ళ పక్కన పడుకుని వారికి మాత్ర్రం నరకం చూపిస్తుంది. ఎవరైతే గురక పెడతారో వారు  చాలా హ్యాపీగా పడుకుంటారు. కాని మన పక్కన పడుకునే వాళ్లకు మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టకుండా చేస్తారు.

ఈ గురక రావడానికి కారణం గొంతులో ఎక్కువగా ఖఫం ఉండటం లేదా ముక్కు లోపలి నాళాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడం. వీటి వల్ల ఈ గురక సమస్య వస్తుఉంటుంది. ఈ  గురుకను  తగ్గించుకోడానికి చాలా మంది అనేక రకాల మందులు వాడి ఉంటారు. అయినా కూడా ఈ గురక తగ్గలేక పోతుంది.

న్యాచురల్ గా ఈ గురకను ఏవిధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

నెమలి నార చెట్టు ఆకు

పల్లెటూరులో ఉంటున్న అందరికీ నెమలినార చెట్టు అంటే తెలిసే ఉంటుంది. ఈ నెమలినార చెట్టుకు వేసవికాలంలో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. చిన్నప్పుడు మనదరం వీటిని ఎంతో ఇష్టంగా తినే వాళ్ళం. ఇవి ఎంతో రుచికరంగా ఉండేవి. ఇందులో ఉండే ప్రోటీన్లు జీడిపప్పు మరియు బాదాంలకంటే ఎక్కువగా ఉంటాయి.

ఈ నెమలినార చెట్టు యొక్క ఆకుల్ని తీసుకుని వాటిని బాగా దంచి అందులో నుండి రసం తీయాలి. ఇప్పుడు రాత్రి పడుకునే ముందు ఈ రసం రెండు ముక్కుల  యొక్క రంధ్రాలలో  ఒకొక్క చుక్క వేసుకొని పడుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తున్నట్లయితే మెల్లిమెల్లిగా గురక పూర్తిగా తగ్గిపోతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి