వయసు పెరిగేకొద్దీ వచ్చే ముడతలకు పూతలు Homemade face packs reduce wrinkles

వయసు పెరిగేకొద్దీ వచ్చే ముడతలకు పూతలు Homemade face packs reduce wrinkles

వయసు పెరిగేకొద్దీ ముఖం, మెడమీదా ముడతలు మొదలవుతాయి. వీటిని తొలగించాలంటే.. ఖరీదైన క్రీంలే రాయాలని లేదు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే చిన్నచిన్న పూతల్ని ప్రయత్నించొచ్చు.

నలుగు: పావుకప్పు తేనెలో రెండు చెంచాల చక్కెర కలిపి ముఖం, మెడ చుట్టూ రాసుకుని మర్దన చేయాలి. కాసేపయ్యాక కడిగేస్తే చాలు.. మృతకణాలు పోయి, చర్మం నునుపుగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవాలి.

ఓట్‌మీల్‌తో: అరకప్పు ఓట్‌మీల్‌ను నీళ్లతో చిక్కగా ఉడకబెట్టి చల్లార్చుకొని, అందులో గుడ్డుసొనా, నిమ్మకాయ రసాన్ని కలిపి ముఖానికి, మెడకు రాయాలి. పదిహేను నిమిషాల తరవాత చన్నీళ్లతో కడిగితే.. చర్మం మెరుస్తుంది.

తెల్ల సొనతో: ఇందులో చెంచా తేనె కలిపి ముఖం, మెడకూ పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లని నీటితో కడగాలి. చర్మం మెరవడమే కాకుండా.. బిగుతుగానూ తయారవుతుంది.

అరటిపండుతో: పావుకప్పు అరటిపండు లేదా బొప్పాయి గుజ్జులో తెల్లసొన కలిపి ముఖం, మెడకు పూతలా వేసుకోవాలి. బాగా ఆరాక కడిగేస్తే.. చర్మం బిగుతుగా మారడంతోపాటూ మృదువుగానూ తయారవుతుంది.

విటమిన్‌ ఈతో: మెడ, ముఖం పై ముడతలు పోవాలంటే ఈ నూనెను రాసుకుని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. చర్మం బిగుతుగా మారడమే కాదు.. తాజాగానూ కనిపిస్తుంది.

సెనగపిండితో: మూడు చెంచాల సెనగపిండిలో సరిపడా పెరుగు వేసి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడకు రాసి బాగా ఆరాక కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే సమస్య అదుపులోకి వస్తుంది.

మరిన్ని బ్యూటీ టిప్స్ మరియు హెల్త్ టిప్స్ కొరకు మా ఛానల్ ఆరోగ్య సూత్రాలు ఒకసారి చుడండి. 

Watch this video

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి