గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట! Health Benefits Of Pumpkin Seeds in Telugu

0
818

మీలో ఉన్న అన్ని అనారోగ్యసమస్యలను దూరం చేసే దివ్య ఔషదం గుమ్మడి. గుమ్మడి పండు తగిలించని  తెలుగు ఇల్లు ఉండదు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి గుమ్మడితో పోతుందంటారు. ఇటు అద్భుతమైన రుచిని అందిస్తుంది. అటు అనారోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషదంగా పనిచేస్తుంది.

ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు కాయను కట్ చేసుకొని గింజలను పారేస్తూ ఉంటారు. అయితే ఆ పారేసి గుమ్మడి గింజల్లో వైద్యపరమైన ఔషధ గుణాలున్నాయని తెలుసుకున్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే  అద్భుతమైన ఈ ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.

గుమ్మడి మరియు గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడిలో విటమిన్ A, C, E, K, యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా జింక్ మరియు మెగ్నీషియం మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో, ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో  బాధపడుతుంటారో అటువంటి వారికి ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయ పడతాయి. వీటిని వారి రెగ్యులర్ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాలి.

గుమ్మడి గింజలు వివిధ రూపాల్లో తీర్చుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పులను తినవచ్చు లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడిని పొడిచేసి పాలలో మిక్స్ చేసుకొని తాగవచ్చు. ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తించుకోదగ్గ ముఖ్యమైన విషయం  ఏంటంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురికావల్సి ఉంటుంది. కాబట్టి గుమ్మడి గింజలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకొని వారు ఎక్కువగా నీళ్ళు పండ్లరసాలను తీసుకోవాలి.

గుమ్మడి గింజలు తినడం వల్ల కలుగు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ప్రస్తుత రోజుల్లో మరణాల రేటు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక కారణం అవుతోంది. కఠినమైన జీవన శైలి ఆహారపు అలవాట్లు నిద్రలేమి పనిభారం వల్ల చాలామంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ ఒత్తిడిని జయించడానికి ఒక పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఈ గుమ్మడి గింజలు పనిచేస్తాయి. ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్, న్యూరోకీమా లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది అలసట ఒత్తిడి మరియు ఇతర సంబంధిత సమస్యలు సమస్యలను నివారిస్తాయి.

ఆస్టియోపోరోసిస్ (osteoporosis) బోలు ఎముకల వ్యాధి

ఈ వ్యాధితో ఎవరైతే బాధపడుతుంటారో  అటువంటి వారు తప్పనిసరిగా ఈ గుమ్మడి గింజలు తీసుకోవటం ఉత్తమం. వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలి ఎందుకంటే గుమ్మడి గింజల్లో అత్యధికంగా జింకు ఉండటంవల్ల ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంకా బోలు ఎముకల వ్యాధితో పోరాడుతుంది.

 కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

ఆహారం ద్వారా శరీరంలో చేరే కొవ్వును ప్రేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను చుకోవచ్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇలా శరీరంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే పైటోస్టిరాల్ Phytosterols నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో జీర్ణమైన తర్వాత పేగుల్లో ఈ పైటోస్టిరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీటివల్ల శరీరంలో చేరవలసిన కొవ్వు శాతం తగ్గుతుంది. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది.

కాన్సర్ తో పోరాడుతుంది.

మన సమాజంలో ప్రాణాంత ప్రాణాంతక వ్యాధిగా విస్తరిస్తున్న మరొక జబ్బు క్యాన్సర్. క్యాన్సర్ను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన జీవిత కాలాన్ని మరింత పెంచుకుని ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. గుమ్మడి గింజలు నివారినిగా ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలు ఎటువంటి  క్యాన్సర్ నైనా ఎదుర్కొంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారించడానికి అవసరమయ్యే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ప్రోస్టేట్ గ్రంధుల వాపును తగ్గించడానికి వైద్యపరంగా ఉమ్మడి కాయ సరిపోతుంది.

డయాబెటిస్ తో బాధపడేవారికి గుమ్మడి చేసే మేలు  

డయాబెటిస్ రాకుండా ఉండేందుకు వచ్చిన వారికి కూడా గుమ్మడి ఎంతో మంచిది. గుమ్మడి తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి గ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుండి తీసిన నూనె వాడడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ ఆరోగ్యాన్ని  కూడా కాపాడుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వారంలో కనీసం మూడు సార్లు గుమ్మడి గింజలను తీసుకోవడం చాలా ఉత్తమం. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కిడ్నీ లో ఏర్పడిన రాళ్లను సహజంగానే కరిగించడానికి సహాయపడుతుంది.

గుమ్మడి – నొప్పులకు దివ్యౌషధం

గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించే యాంటి  ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులను మరియు బాధలనుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారిస్తాయి.

ఎప్పుడూ ఆకలిగా ఉంటుందా?

చాలామంది పిల్లలు అలాగే కొంతమంది పెద్దలు కూడా ఎప్పుడూ అదే పనిగా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఆకలి ఉన్నా లేకున్నా తింటూ ఉంటారు. అటువంటి వారికి గుమ్మడి గింజలు సహాయ పడతాయి. వీటిని తరచూ తీసుకుంటే ఆకలి ఎక్కువగా అనిపించక కడుపునిండినట్లు అనుభూతి కలిగిస్తుంది.

గుమ్మడి గింజలు – సూపర్ ఫుడ్స్

సూపర్ ఫుడ్స్ లిస్టులో ఈ గుమ్మడి గింజలను టాప్ లో ఉంచవచ్చు ఎందుకంటె  వర్కౌట్స్ ముందుగా గుప్పెడు గుమ్మడి గింజలను తినడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ ను అమాంతంగా పెంచుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గుమ్మడి గింజలను రెగ్యులర్ గా తినడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ గుమ్మడి గింజలు హార్ట్ పేషంట్స్ రెగ్యులర్ గా తినడం వల్ల గుండె మరియు కరోనరీ హార్ట్ (coronary heart) వ్యాధులను నిర్వహించుకోవడం లో అద్భుతంగా సహాయపడుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here