అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయాజనాలు Health benefits Anjeer in Telugu

0
2271
Health Benefits Anjeer in Telugu

ఆకర్షనీయమైన రంగూ, రూపం గానీ అంజీర్ కు లేవు. కాని ఇవీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అద్భుతమైన రుచితోపాటు పోషకవిలువలు కూడా పుష్కలంగా ఇందులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ రూపంలోనే అంజీర్ వాడకం ఎక్కువ. Health benefits Anjeer in Telugu

Anjeer Fruit – అంజీర పండ్లు

రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అంజీర్లో ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వారైనా అంజీర్ ను తీసుకొంటే త్వరగా కోలుకుంటారు.

శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి. శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తాయి. క్యాన్సర్ తరహా గడ్డల నివారణకు అంజీర్ బాగా పనిచేస్తాయి.

వీటిల్లో అధికంగా ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఈ పండ్లు మధుమేహం (షుగర్) ఆస్తమా, దగ్గు వంటి వ్యాధుల్ని తగ్గిస్తాయి.
ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి మంచి మందుగా పని చేస్తాయి. What are the Health benefits Anjeer in Telugu.

లైంగిక బలహీనతలను తగ్గిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధుల బారినపడి బలహీనంగా మారిన వాళ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు.

మలబద్దకానికి ఈ పండు పెట్టింది పేరు. అజీర్తిని తొలగిస్తుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకల వృద్దికి పుష్టికీ దోహదపడుతుంది.

ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.అందుకే నిద్రలేమితో భాదపడేవాళ్లు రోజూ రాత్రి పూట ఈ పండుని తిని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.

ఇందులోని జిగురు గొంతు నొప్పినీ, పుండ్లనీ తగ్గిస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే దృష్టిలోపాల్ని ఈ పండ్లు తగ్గిస్తాయి.

అంజీన్ డ్రైపూట్లో ఐరన్ చాలా ఎక్కువ. కడుపు నొప్పి, జ్వరం, చెవినొప్పి, లైంగిక వ్యాధులను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. దీనిలో ఉన్న పీచు పదార్ధం కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

Dry Fruit Figs - Anjeer
Dry Fruit Figs – Anjeer

మొలలు ఉన్న వాళ్లు రెండు లేదా మూడు అంజీర్పళ్లను నానబెట్టి తీసుకోసుకుంటే తగ్గిపోతాయి. Don’t miss to read this : కీళ్ళ నొప్పులకు 9 చిట్కాలు

ఆడపిల్లలు రోజూ రెండు పళ్లు తింటే ముఖంపై మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు. రక్తం తక్కువగా ఉన్న వారు అంజీర్ పళ్లను తీసుకుంటే రక్తం వృద్ధి కలుగుతుంది.

అంజీర పళ్లు తింటే ముసలితనపు లక్షణాలు దరిచేరకుండా చూసుకోవచ్చు.ఎదుగుతున్న పిల్లలు రోజూ ఒకటి తింటే ఎముకలు గట్టిపడతాయి. అలాగే బుద్ధి మాంద్యత లక్షణాలు తగ్గి తెలివితేటలు పెరుగుతాయి. ఇన్నీ ప్రయోజనాలు ఉన్న అంజీర్ ను రోజూ తినండి.. ఆరోగ్యంగా ఉండండి.

Watch Video for Health Benefits of Anjeer in Telugu more information and also subscribe to our Youtube channel ఆరోగ్య సూత్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here