గాంధీ జయంతి శుభాకాంక్షలు – మహాత్మా గాంధీ సూక్తులు

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 – జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.

ఈరోజు గాంధీ జయంతి, భారత పితామహుడు, బాపు అని పిలువబడే ఈయన ఎన్నో సూక్తులు మనకు అందించారు. ఇప్పటికి అవి ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి ప్రేరణగా కొనసాగుతున్నాయి.

Gandhi Jayanti 2018, Inspirational quotes by gandhi, Most inspiring quotes from the ‘Father of the Nation’, Mahatma Gandhi Beautiful Messages lines in Telugu language, Mahatma Gandhi Daily Quotes images in Telugu, Best Gandhi Quotes ever in telugu, gandhi quotes in telugu

“శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది”

“విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలి పోయేది కాదు అది అచంచలమైనది హిమాలయాలంత స్థిరమైనది”

“నా దగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు ప్రపంచంలో స్నేహం చేసుకోవడమే నా గమ్యం”

“నన్ను స్తుతించే వారికంటే నన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నేను అధికంగా మంచి పొందుతున్నాను.”

“ప్రార్థన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి రాత్రి పడుకునేముందు తలుపు గడియ.”

“కష్టపడి పని చేయని వ్యక్తికి తిండి తినే హక్కులేదు”

“లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది.”

“మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి వీటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహన శక్తి అవసరం.”

“దుర్బల బాధల అనుభవం నిజాయితీకి ఒరిపిడిరాయి.”

“భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.”

“చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.”

“ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి.”

“తనకు తాను తృప్తి పడే మానవుడు ఇక ఎదగడు.”

“ఎక్కువ తక్కువలు కులమత బేధాలు ఉండటం మానవజాతికి అవమానకరం.”

“విద్యను దాచుకోవడం కన్నా పది మంది పంచితే మరింత పెరుగుతుంది.”

“మేధావులు మాట్లాడుతారు మూర్ఖులు వాదిస్తారు.”

“మనిషి గొప్పతనం మెదడులో కాదు హృదయంలో ఉంటుంది.”

“వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.”

“బలహీనుడు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి.”

“ఏదైనా సహాయం చేస్తే వెంటనే మరిచిపో ఎవరినుంచైనా సహాయం పొందితే జీవితాంతం గుర్తించుకో.”

“నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం ఇతరుల సేవలో నిన్ను నువ్వు మరిచిపోవడమే.”

“కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు.”

“మీ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి.”

“ఇతరులు పొరపాటుగా పోల్చుకుంటే బాధే మిగులుతుంది.”

“ప్రపంచంలో మానవుని అవసరానికి సరిపడా ఉంది అంతేకానీ ఆశ కు సరిపడా లేదు.”

“మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే.”

“పొదుపు చేయవలసిన చోట ఖర్చు చేయకు ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు.”

“మనం పొరపాటున ద్వారా ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకుని లాభం పొందుతాము.”

“పాపాలన్నీ రహస్యంగా చేస్తాం దేవుడు మన ఆలోచనలకు కూడా సాక్షి అని తెలిసినప్పుడు మనం సేవ స్వేచ్ఛా జీవులం అవుతాం.”

“మరొకడు చేసిన పాపానికి నువ్వు వ్యక్తిగతంగా అపరాధభావనకు లోనుకావద్దు. దాగిన పాపం విషతుల్యం.”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి