గోధుమ రవ్వలో ఉండే పోషక విలువలు..వాటి వివరాలు.. Dalia nutritional values in Telugu

Dalia nutritional values in Telugu సరైన సమయానికి ఆహరం తినడం కష్టంగా ఉంటున్న నేటి తరంలో..ఆరోగ్యకరంగా తినడం అనేది అరుదైపోయింది. కాని ఇప్పటికీ, ఎప్పటికి మంచి ఆరోగ్యకరమైన, పోషక  విలువలున్న ఆహారం తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు వీటిలోని పోషకాలతో సరైన ఆహారాలు అవుతాయి. అలాంటిదే గోధుమ రవ్వ (దలియ).

ప్రోటీనుల ఖనిజం గోధుమ రవ్వ

ప్రోటీన్లు పుష్కలంగా లభించే గోధుమ రవ్వ (దలియ) కండరాల నిర్మాణానికి ,బరువు పెరగడానికి సరైన ఆహారం. దీన్ని ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తీసుకోవచ్చు, అల్పాహారంగా, లంచ్ లో లేదా డిన్నర్ లో, మీ ఇష్టం.

నియంత్రణలో బ్లడ్ షుగర్

మీకు షుగర్ వ్యాధి ఉంటే ధలియా సరైన ఆహారం. దీంట్లోని తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ మరియు కాంప్లెక్స్ కార్బ్స్  శరీరం లోకి గ్లూకోస్ నియంత్రణను క్రమబద్దికరిస్తాయి. దీనితో షుగర్ లెవెల్స్ అదుపులోకి  తేవడం తేలిక  అవుతుంది.

See also : సమస్త రోగ వర్ధకం మలబద్ధకం … కాదంటారా? Best home remedies for constipation

మెటబాలిజం మెరుగుపడుతుంది

హై ఫైబర్ మరియు ప్రోటీన్స్ దలియాను సూపర్ ఫుడ్ గ చేస్తాయి. దీని కారణంగా శరీర సామర్థ్యం పెరిగితే మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ఇది మలబద్దకాన్ని కూడా నిర్మూలించడం లో ఎంతగానో సహాయ పడుతుంది.

బరువుని అదుపులో ఉంచుతుంది

ఫైబర్ లు  అధికంగా గోధుమ రవ్వలో ఉంటాయి. ఇది తింటే ఎక్కువ సేపు కడుపునిండుగా అనిపిస్తుంది. ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా, జంక్ ఫుడ్ తినాలనిపించదు. పొద్దునే బ్రేక్ఫాస్ట్ గ దీన్ని తీసుకోవడం తో రోజంతా ఆక్టివ్గా, ఉల్లాసంగా ఉండడమే కాదు, శరీరానికి కావాల్సిన  న్యూట్రిషన్ల్ కూడా లభిస్తాయి.

[amazon_link asins=’B079J586BD,B0723DHSJF,B074N9WWYZ’ template=’ProductCarousel’ store=’asweb2018-21′ marketplace=’IN’ link_id=’a8d72f9d-89e9-11e8-8ae9-d5c2659c779e’]

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి