సమస్త రోగ వర్ధకం మలబద్ధకం … కాదంటారా? Best home remedies for constipation

Best home remedies for constipation అన్ని వ్యాదులకి మూల కారణం మలబద్ధకం. వినడానికి చిరాకు అనిపించినా, చెప్పుకోడానికి సిగ్గుగా అనిపించినా దీన్ని నివారించకపోతే ఆరోగ్యం మీదరికి చేరదు.

ఏదో ఒక అనారోగ్యం తరుచూ వచ్చి పోతుంటే, మలబద్ధకం ఉందని గ్రహించాలి. అలాగే మలబద్ధకం ఉంది అంటే, ఏదో అనారోగ్యం పొంచి ఉందని భావించాలి. రోజు విరేచనం అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. మీరు తినే ఆహరం సరిగ్గా జీర్ణం కాకపోవడం, సరిగ్గా నమిలి తినకపోవడం వల్ల, అన్నము తిన్న తర్వాత మంచినీరు ఎక్కువగా తాగాక పోవడంవలన, పీచు పదార్థాలు తినకపోడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

అసలు మలబద్ధకాన్ని ఎలా గుర్తించాలి? ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ఈ ఇబ్బంది?

మలబద్ధకం ఎక్కువ ఆడవారిలో కనిపిస్తుంది. ఉదయం లేచిన మొదలు అర్ధరాత్రి పడుకొనే వరకు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు విరేచనానికి వెళ్ళడానికి కూడా సోమరితనం చూపిస్తుంటారు. తరువాత వెళదాం అనే ఆలోచనే అలవాటుగా మారిపోయి మలబద్ధకంలా వచ్చి కూర్చుంటుంది.

ఇక అటు ఆఫీసుకు వెళ్ళే వారు కూడా ఈ వ్యాధికి పాత నేస్తాలే. హడావుడి జీవన శైలి, ఎల్లప్పుడూ టూర్స్ అంటూ, క్యాంపులకు తిరిగేవారు, ఇంటిపట్టున వుండే అవకాశం లేనివారు, బైట ఫుడ్స్ కి అలవాటు పడినవారు కూడా మలబద్ధక బాధితులే. నీరసం, ఉత్సాహం లేకపోడం, దగ్గు, ఆయాసం, గ్యాస్,  తలతిరగడం,నిద్రమత్తు, ఇవన్నీ మలబద్ధకం ఉన్నవారిలో కనిపించే ఇతర  లక్షణాలు.

See also : Amazing Health Benefits of Drinking Milk with Jaggery పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే అద్భుతాలే తెలుసా!

మలబద్ధకం ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?

దగ్గు, జలుబు, తగ్గించే యాన్టి హిస్టమిన్లు, ఎలర్జీకి సంబంధించిన ఔషధాలు కొన్నింటిని తీసుకునేవారికి మలబద్ధకం వస్తుంటుంది. ఇవే మందులు మలబద్ధకానికి కారణం అవుతుంటాయి.  పేగుల్లో జడత్వం అనేది ఈ లక్షణానికి కారణం. సాధ్యమైనంతవరకు ఈ వ్యాధిని మందులతో కాకుండా, ఆహరశైలిలో మార్పులు, తగిన శ్రద్ధ పాటిస్తే పూర్తిగా పోతుంది. పొగత్రాగడం మానేయాలి, వేలైనంత వరకు కాఫీ, టీలు, తగ్గించాలి.

వంటింట్లో దొరికే పదార్ధాలతో మీ మలబద్ధకాని ఇట్టే మాయం చేయచ్చు… Best home remedies for constipation

Constipation relief food
Constipation relief food
  • ఇంగువను తిన్నా,నువ్వ్వుల్ని, బెల్లాన్ని సమపాళ్ళల్లో మర్ధించి రాత్రి పడుకునేముందు నిమ్మకాయంతగా తింటే మంచిది.గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగితే  విరేచానాన్ని అయ్యేలా చేసి పేగుల్ని శుభ్రపరుస్తుంది.
  • అల్లం మెత్తగా దంచి అందులో సైంధవ లవణాన్ని కలిపి రోజు అన్నంతో పావు చెంచా మోతాదులో నెయ్యి వేసుకు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.
  • ప్రతీ రోజు చింతపండు చారు తాగండి. చింతపండు లాక్సేటివ్ లాగా పనిచేస్తుంది. అందరూ చేయలేరు కాని, కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి రాత్రి పడుకునే ముందు తాగితే, ఉదయం లేవగానే మీకు విరేచనం తప్పక అవుతుంది. ఆముదం పేగుల్ని సైతం కదుపుతుంది.
  • అలానే మగ్గిన అరిటిపండు, బొప్పాయి పండు రోజూ తింటే కొద్దికాలానికే మీలో మార్పు గమనిస్తారు. ఇక ద్రాక్ష, కమలాలు, కిస్మిస్, యాపిల్, వంటి పళ్లకు విరేచానాన్ని కల్గించే గుణం వుంది.
  • బీన్స్, సోయాబీన్స్ , చిక్కుడు, అలసందు, సొరకాయ, ములగకాడలు లాంటి ఆహార పదార్థాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలానే బీర, బెండ, వంటివి, ఇక ఇతర రకరకాల ఆకు కూరలు ప్రతిరోజు వాడాలి.
  • బూడిదగుమ్మడికాయ కూర ఎంతో చలవ చేయడమే కాకుండా విరేచనం అయ్యేలా చేస్తుంది.
  • యుక్త వయసులోనే మనిషి బద్ధకంగా, చీటికి మాటికీ అలసటతో బాధపడుతుంటే అతనికి మలబద్ధకం ఉందని గుర్తించాలి.
  • మలబద్ధకమే అనేక వ్యాదులకి కారణం అలానే అనేక వ్యాధులు తిరిగి మలబద్ధకాన్ని పెంచుతూ వుంటాయి. ఇలా వ్యాధులూ,మలబద్ధకం కలిసిమెలిసి జీవిస్తూ మనిషిని నెమ్మదిగా చంపేస్తుంటాయి.

అందుకే …పెద్దలు అన్నారు…..సమస్త రోగ వర్ధకం మలబద్ధకం

మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా Youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక subscribe చేసుకోండి.

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి