వాము గురించి ఈ విషయాన్నీ తెలుసుకోండి లేకపోతే చాలా మిస్ అవుతారు Amazing Health Benefits of Ajwain

మన వంటగదిలో ఉండే వాములో ఎన్నో ఔషధ గుణాలు పోషక విలువలు కలిగి ఉన్నాయి. వాము కాస్త ఘాటుగా ఉన్న మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాములో ఉండే అనేక రసాయనాల వలన మన జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది.

రోజు వామును మనం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రోజు ఒక స్పూన్ వామును తింటే రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి వాము ఒక చిక్కటి దివ్య ఔషధం.

అధిక బరువును తగ్గిస్తుంది

ప్రతి రోజు ఒక టీ స్పూన్ వామును నీళ్లలో కలిపి తీసుకున్న లేదా డైరెక్ట్ గా తీసుకున్నా శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఫలితంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు తగ్గి పోయి అధిక బరువు తగ్గిపోతుంది. అంతేకాదు వాములో అధికంగా ఉండే తైమల్ (thymol) అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్గా ఫంగల్ వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది.

పాములు విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తలనొప్పి జలుబు అలసట వంటివాటిని తగ్గించడానికి వాము చక్కటి మెడిసిన్లా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గర్భిణి స్త్రీల కొరకు వాము

గర్భిణి స్రీలలో ఆకలి తగ్గిపోవడం లేదా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు రోజు కొద్దిగా వామును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డైజషన్ సమస్యలు రాకుండా ఉంటాయి.

కడుపు నొప్పిని తగ్గిస్తుంది

కడుపునొప్పిగా ఉన్నప్పుడు కొద్దిగా పామును తీసుకుంటే తక్షణ మందులా పనిచేస్తుంది. ఇది కడుపులోని అసిడిటీని గ్యాస్ ను తగ్గించి కడుపునొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అజీర్తి సమస్యలు తొలగిపోతాయి

ఒక టీ స్పూను వాము ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగినా లేదా వేడి వేడి అన్నంలో కలిపి తీసుకున్నా అజీర్తి తగ్గి పోయి ఆకలి బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ వంటి సమస్యలు మన దరికి చేరకుండా ఉంటాయి. మలబద్దక సమస్య కూడా తగ్గిపోతుంది.

Homemade Skin Whitening Remedy ఒక్కసారి ఇలా చేయండి ముఖం తెల్లగా మెరిసిపోతుంది Get Fair and Glowing skin

కాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది

 ఇప్పటి రోజుల్లో చాలామంది కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వాము నుండి తీసిన నూనెను కీళ్ళ నొప్పులపై అప్లై చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజూ వామును తీసుకోవడం వలన ఆల్కహాల్ తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుందట.

ముత్ర సంబధిత సమస్యలను తగ్గిస్తుంది

ఒక టీ స్పూన్ వాము లో నాలుగు టీస్పూన్ల మారేడు ఆకుల రసం కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మధుమేహం ఉన్న వారిలో మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది

ప్రతి రోజు ఒక టీ స్పూను వాము ను తీసుకోవడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. రక్తం లోని కొవ్వు నిల్వలు తగ్గి పోతాయి. ఫలితంగా గుండెకు రక్తం సరఫరా సజావుగా జరుగుతుంది. పలు ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.

శృంగార సమస్యలకు వాము

How to grow leafy vegetables easily at home? ఆకు కూరలు ఇంట్లో సులువుగా పెంచడం ఎలా ?

 ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా వామును వేసి నానబెట్టాలి. అలా నానబెట్టిన నీటితో పురుషాంగాన్ని కడిగితే శృంగార శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

నలసరి సమస్యలకు

ప్రతిరోజూ వామును తీసుకోవడం వలన నెలసరి సమస్యలు మరియు ఆ సమయంలో నొప్పులు వంటివి బాధించవు. అలాగే నెలసరి క్రమంగా వస్తుంది.

ఇంట్లో ఉండే వామును ఈరోజు కొద్దిగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి కనుక మీరు కూడా వామును తీసుకొని ఆరోగ్యంగా జీవించండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి