రోజూ పసుపు నీరు తాగితే ఇన్ని లాభాలా? Amazing benefits of Turmeric with Water daily

రోజూ పసుపు నీరు తాగితే ఇన్ని లాభాలా?

చాలా మంది ఉదయం లేవగానే టీ కాఫీలను తాగుతుంటారు. అవి తాగడం వల్ల ఐదు నిమిషాలు ఆనందం మాత్రమే ఉంటుంది. వాటితో ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉండవు. మరికొందరు ఆరోగ్యం కోసం రకరకాల జ్యూసులను తాగుతుంటారు. అవన్నీ మీ ఆరోగ్యాన్ని బాగు చేశాయో లేదో తెలియదుకానీ, ఇప్పుడు తెలుపబోయే ఈ పసుపు కలిపిన నీళ్లను తాగితే తప్పకుండా మీ ఆరోగ్యంలో మార్పులు కనిపిస్తాయి. Amazing benefits of Turmeric with Water daily

పసుపు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలుచేస్తుంది. పసుపు వాత, పిత్త, కఫ రోగాలు నయం చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ పసుపులో యాంటి ఏజింగ్ యాంటీఇన్ఫ్లమేటరీ అండ్ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పసుపు అపరేటిస్ లక్షణాలను నివారిస్తుంది. ఇన్ని గుణాలు కలిగివున్న పసుపు నీటిని ఉదయాన్నే తీసుకోవడం చాలా మంచిది.

అయితే ఈ పసుపునీళ్ళు ఏవిధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి,  అందులో హాఫ్ లెమన్ జ్యూస్ ని, ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాలి. ఈ రెమిడిని 12 నెలలపాటు ఖాళీ కడుపున ఉదయం తాగాలి.

ఇలా ప్రతి రోజూ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఈమధ్య కాలంలో చాలామంది ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ పసుపు కలిపిన నీళ్లను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల కొన్ని నెలల్లోనే ఆ నొప్పులు తగ్గిపోతాయి.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. అది కీళ్ళ నొప్పులను joint pains ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి. అలాగే ఇందులో కుర్కుమిన్ వాపులను తగ్గిస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ గుణాలు లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రాకుండా కాపాడుతుంది.

ఇది బ్లడ్ క్లాట్ లను నివారించడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు. ఇటీవల జరిపిన రీసెర్చ్ ప్రకారం పసుపు నీళ్లును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ను నివారించుకోవచ్చుఅని తెలిసింది. ( ఈ పోస్ట్ తప్పక చదవండి : పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే అద్భుతాలే తెలుసా!)

ఈ వాటర్ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అసిడిటీని నివారిస్తుంది.

ఈ వాటర్ లివర్ కు చాలా మంచిది. లివర్ ను డామేజ్ చేసే టాక్సిన్స్ ను తొలగించడంలో ఈ పసుపు వాటర్ చక్కగా ఉపయోగపడతాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ లక్షణాలు మతిమరుపు సమస్యను నివారిస్తుంది.

దగ్గు జలుబు తో బాధపడేవారికి వేడిపాలలో పావు టీస్పాన్  పసుపు వేసి  రోజులో రెండుపూటల తాగిస్తే జలుబు, దగ్గు తొందరగా తగ్గిపోతాయి.

పసుపులో ఉండే కుర్కుమిన్ ఫ్రీరాడికల్స్ తో పోరాడి స్కిన్ inflammation ను దూరం చేయడం వలన ఏజింగ్ సమస్యలు ఉండవు. ఇది ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తుంది.

పూర్తి వివరాలకు ఈ వీడియో తప్పక చుడండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ఆరోగ్యసూత్రాలు తప్పక చుడండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి