మన శరీరంలోని వేడిని తగ్గించడానికి 10 చిట్కాలు – 10 Best Tips to decrease body Temperature in summer

ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి అంతే కాకుండా శరీరం కూడా వేడిగానే ఉంటుంది. అసలు ఎందుకు మన శరీరం వేడిగా ఉంటుంది? దానికితోడు యూరిన్ కూడా వేడిగా వస్తుంది. దీనికి కారణం పిత్త ప్రకృతి.

అసలు పిత్తం అంటే ఏమిటి మన శరీరంలో ఉండే బయో రెగ్యులేటింగ్ ప్రిన్సిపల్.  వాతం పిత్తం  కఫం అనే ఈ మూడు మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పిత్తం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే పని శరీరంలో  వేడి ఏర్పడుతుంది. ఈ వేడిని  మనం తగ్గించాలంటే ఏం చేయాలి?

ఈ వేడిని తగ్గించడానికి మీకు ఒక పది చిట్కాలను ఇప్పుడు  తెలుసుకుందాం

  1.  దానిమ్మ జ్యూస్ ని తీసుకొని అందులో ఆల్మండ్ ఆయిల్ని నాలుగు చుక్కలు కలిపి త్రాగాలి.
  2. ఉదయం లేవగానే గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి  ఉప్పు లేదా పంచదార కలిపి త్రాగాలి.
  3. గ్లాసుడు పాలలో  రెండు టేబుల్ స్పూన్ల వెన్న కలిపి తాగితే వేడి తగ్గుతుంది.
  4. గసగసాలు వేడిని చాలా తగ్గిస్తుంది. కాని తగిన మోతాదులో తీసుకోవాలి
  5. గ్లాసుడు పాలలో ఒకస్పూన్ తేనెలో కలిపి తాగాలి
  6. మెంతులు ఒక  టేబుల్ స్పూన్ వంట చేసేటప్పుడు వేసుకోవాలి.
  7. అలోవెరా జ్యూస్ చలువ చేస్తుంది. దాని ఆకుల మధ్యలో ఉండే జెల్ ను మన నుదుటికి రాసుకుంటే కూల్ గా ఉంటుంది.
  8. గంధాన్ని పాలలో లేదా నీటిలో కలిపి తాగితే వేడి మటుమాయం అవుతుంది.
  9. చందన తెర్లు తీసుకొని చల్లని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఉదయం వేడి చేయాలి. చందనపు అర్గం ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. ఈ ఆవిరిని 10 నుండి 60  మిల్లీలీటర్ల మోతాదులో తీసుకోవాలి. అంటే రెండు లేదా మూడు స్పూన్ల చందన అర్కను  తీసుకోవాలి. ఇది తాగడం వల్ల శరీరంలోని మొత్తం వేడిని మటుమాయం చేస్తుంది.
  10. ఇది చాలా సులభమైనది. అంతేకాకుండా చాలా ముఖ్యమైనది. ఎక్కువ మంచినీళ్లు తీసుకోవడం వల్ల సమ  ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. రోజుకి వీలైనంత ఎక్కువ సార్లు మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నించండి.

ఈ ఆర్టికల్ నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చి పోకండి ..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి